Xiaomi Redmi 13: అందుబాటు ధరలో 108MP కెమెరా ఫోన్..5G వేగం, 33W టర్బో ఛార్జింగ్ కూడా.. 10 month ago

featured-image

Xiaomi తన రెడ్‌మి సిరీస్‌లో మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని Redmi 13 అనే 5G స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ 5G వేగం, ఆకర్షణీయమైన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కెమెరా.. ఎందుకంటే డ్యూయల్ కెమెరా సెట్-అప్ తో 108MP వైడ్ యాంగిల్‌ సదుపాయాన్ని అందిస్తుంది. అదికూడా కేవలం రూ.15 వేల లోపే అందిస్తూ ఈ ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది. Redmi 13 ఫీచర్లు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.!


Redmi 13 ఫీచర్లు:

డిస్‌ప్లే: 6.79 అంగుళాల IPS LCD

రిఫ్రెష్ రేటు: 120 Hz

ప్రాసెసర్: Qualcomm Snapdragon 4 Gen 2

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v14

బరువు: 205 గ్రాములు

బ్యాటరీ: 5030 mAh

ఛార్జింగ్: 33W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్


కెమెరా ఫీచర్లు:

బ్యాక్ కెమెరా:

  • 108 MP మెయిన్ కెమెరా
  • 2 MP మాక్రో కెమెరా

ఫ్రంట్ కెమెరా: 13 MP 


వేరియంట్స్:

  • 6GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 128GB స్టోరేజ్


కనెక్టివిటీ ఫీచర్లు:

  • 5G, 4G డ్యూయల్ సిమ్ + హైబ్రిడ్
  • Wi-Fi 5
  • బ్లూటూత్ v5.0, GPS
  • 3.5 mm ఆడియో జాక్


సెన్సార్లు: ఫింగర్‌ప్రింట్ సెన్సార్ (సైడ్), లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్.


కలర్ ఆప్షన్స్: 

  • ఆర్చిడ్ పింక్
  • బ్లాక్ డైమండ్
  • హావైయెన్ బ్లూ


ఫోన్ ధర:

  • 6GB RAM, 128GB స్టోరేజ్-- రూ.12,499
  • 8GB RAM, 128GB స్టోరేజ్-- రూ.13,999 


ప్లస్ పాయింట్స్:

  • వాటర్ రెసిస్టన్స్
  • ప్రీమియం లుక్
  • 108MP కెమెరా
  • 33W టర్బో ఛార్జింగ్


మైనస్ పాయింట్స్:

  • NFC లేదు.
  • పాత బ్లూటూత్ వెర్షన్.
  • గేమింగ్ కి పనికిరాదు


Redmi 13 5G మధ్యతరగతి వినియోగదారులకు ఒక అద్భుతమైన ఎంపిక. ఈ ఫోన్ ధరలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీని ధర అమెజాన్ లో.. ఫ్లిప్‌కార్ట్ కన్నా ఒక వెయ్యి తక్కువగా ఉంది. 108MP కెమెరా, 5G కనెక్టివిటీ, పెద్ద డిస్‌ప్లే, మరియు శక్తివంతమైన బ్యాటరీతో ఈ ఫోన్ మీ డబ్బుకు పూర్తి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ఆన్‌లైన్ తో పాటు ఆఫ్‌లైన్ లో కూడా అందుబాటులో ఉంది.



ఇది చదవండి: స్టైలిష్ డిజైన్‌లో 5G స్మార్ట్‌ఫోన్! బడ్జెట్‌లో "టెక్నో పోవ 6 నియో" మొబైల్..




Related News

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD